ఇందిరమ్మ ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపిడిఓ, పంచాయతీ రాజ్ మరియు ఆర్ అండ్ బి ఇంజనీర్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జనవరి 26వ తేదిన మండలాల వారిగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణి దాదాపు 2543 మందికి అందజేశామని తెలిపారు. గ్రామాల్లో గ్రామ స్పెషల్ అదికారుల సమక్షంలో ఎంపిడిఓ ల నేతృత్వంలో పంచాయతీ సెక్రటరి లతో అసలైన లబ్దిదారులకు అందించేందుకు మరియోకసారి లబ్దిదారులతో చర్చించి వారి ఎంపిక స్థలంలో ఇంజనీరింగ్ ఎఈ లతో ఇందిరమ్మ మాడల్ హౌసింగ్ మ్యాప్ ను చుపించి పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారికి ఆయా స్థాయి ప్రకారం పూర్తైన విధంగా ఎఈ లు ఎంబి రికార్డు చెసి అప్లోడ్ చేస్తే డబ్బులు మంజూరు అవుతాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ కు ఎంపిడిఓ నోడల్ అధికారి మరియు ఇంజనీర్ ఎజెన్సీ పంచాయతీ రాజ్ వారు ఉంటారని తెలిపారు. జిల్లాల్లో ప్రోగ్రెసివ్ లో ఉన్న పిఎచ్ సి, సబ్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చెయ్యాలని తెలిపారు. స్థల సేకరణ కోరకు ఆర్డిఓలను సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇంజనీర్ శాఖ అధికారులకూ తెలిపారు.
అలాగే మండలానికో మాడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం కోరకు స్థలాన్ని సేకరణ చేసి మాడల్ హౌస్ త్వరగా పూర్తైయ్యోలా చూడాలని తెలిపారు. ఈ సమావేశం లో హౌసింగ్ పిడి దామోదర రావు, డిఏంఅండ్ఎచ్ఓ పల్వన్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డిఈ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.