భువనగిరి మండల కేంద్రంలో ఎస్ జి టి యు జిల్లా కార్యవర్గ సమావేశం

ఎస్ జి టి యు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్. జి .టి .యు .రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంకినేని మధుసూదన్ రావు ఎస్ .జి .టి .యు .రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికల వెంకటేశం మరియు ఎస్జీటీయూ రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి పండుగ అంజయ్య పాల్గొన్నారు . జిల్లా కార్యవర్గ సమావేశంలో సంకినేని మధుసూదన్ రావు  మాట్లాడుతూ ఎస్జీటీలకు ఓటు హక్కు లేవకపోవడం విచారకరమన్నారు . ఎస్ .జి .టి ల ఓటు హక్కు కోసం రాష్ట్ర సంఘం తీవ్ర ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు . అదేవిధంగా ఎస్జీటీ లు ఏకం గా ఉన్నప్పుడే ఎస్ జి టి ల సమస్యలు, ప్రాథమిక పాఠశాల సమస్యలు అన్ని పరిష్కరించబడతాయి అన్నారు. అరికల వెంకటేశ మాట్లాడుతూ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఎస్ జి టి యు ఢిల్లీ వరకు వెళ్లి కూడా ప్రాతినిధ్యాలు చేయడం జరిగిందన్నారు.  పండుగ అంజయ్య  మాట్లాడుతూ ఎస్ జి టి లందరూ ఐకమత్యంగా ఉండి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయాలని కోరినారు. జిల్లా ప్రధాన కార్యదర్శి  భత్తుల దశరథ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ఎస్ జి టి యు శతవిధాల ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు  వనం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వచ్చే పదిహేను రోజులలో జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం ఏ పిలుపు ఇచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా ముందుంటుందని పేర్కొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాద్యులు రామ్ దయాకర్ రెడ్డి ,వీరేషం, కృష్ణమూర్తి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా బాధ్యులు కే రవి, జి సత్తయ్య, బిక్షం, మల్లేశం, నరేష్, నరసయ్య, రమేష్  పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment