జర్నలిస్ట్ పై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఖండిచారు.. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వాహణలో ఉన్న జర్నలిస్ట్ పై దాడిచేయడం సరికాదని, దాడిని ఖండిస్తున్నామని అన్నారు. మీడియా స్వేచ్చకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించరాదని చెప్పారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా జర్నలిస్టులు మంచు మనోజ్ తో పాటు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఆ క్రమంలో జర్నలిస్ట్ మోహన్ బాబును గొడవల గురించి వివరణ అడిగారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు, జర్నలిస్ట్ పై దాడికి దిగారు. జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్ లాక్కోని దానితో జర్నలిస్ట్ పై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
జర్నలిస్ట్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా
Updated On: December 11, 2024 12:43 am
