నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోర్టు కేసులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీ లను అభినదించి ప్రశంస పత్రాలను అందజేశారు ఎస్పీ మాట్లాడుతూ….నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినదనియని అన్నారు.పోలీస్ ఆదికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.
గడిచిన రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు. వెల్గటూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులో ఒకరికి జీవిత ఖైదు, జగిత్యాల టౌన్, మల్యాల పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన పోక్సో కేసులో ఒక్కరికీ 20 సంవత్సరాల జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు. పై కేసుల్లో నిదితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలను అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ యొక్క సమావేశంలో డిఎస్పీలు రఘు చందర్, రాములు, రంగారెడ్డి, పిపీలు పాల్గొన్నారు.