అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి రవాణా చేస్తున్నా వారిపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.- జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి

టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, SI ప్రశాంత్ వర్ధన్ మరియు టీం అధికారులు జిల్లాలో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి రవాణా చేస్తున్నా 8 మందిని అదుపులోకి తీసుకోని మూడు ఇసుక ట్రాక్టర్లు, ఎర్రమట్టి తరలిస్తున్నా మూడు టిప్పర్ లు, ఒక జేసీబీ, ఒక కార్ మరియు 4 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని వారిపైన ఆయా పోలీస్ స్టేషన్స్ పరిధిలలో కేసులు నమోదు చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది. అట్టి వివరాలు.

వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధన్నారం గుట్ట నుండి ఎర్రమట్టిని తరలిస్తున్నా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని మూడు ఎర్రమట్టి లోడ్ చేసిన టిప్పర్ వాహనాలు, ఒక జేసీబీ, ఒక కార్, 4 సెల్ ఫోన్లు వారి నుండి స్వాధీనం చేసుకొని వారిపైన వికారాబాద్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ట్రాక్టర్ మరియు యాలల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ట్రాక్టర్ లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారిపైన ఆయా పోలీస్ స్టేషన్స్ పరిధిలలో కేసు నమోదు చేయించడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.

జిల్లా లో PDS బియ్యం, ఇసుక, ఎర్రమట్టి, మోరం అక్రమ రావణాలు చేసిన, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఇట్టి కార్యకలాపాలకు పాల్పడిన, ప్రోత్సహించిన ఎంతటి వారు అయిన ఉపేక్షించేది లేదని,జిల్లాలో ఎవరైనా చట్టవ్యతిరేఖ, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన, అక్రమంగా రావణాలు జరిపిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి ఆంజనేయులు సెల్ నెంబర్ 8712670022 ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ తెలిపినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment