పేకాట స్థావరాలపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

  జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ రెడ్డి, IPS ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఆద్వర్యంలో జిల్లా లోని నవాబ్ పేట్ మరియు బషీరాబాద్ పోలీస్ ల పరిధిలలో ఉన్న పేకాట స్థావరాలపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2 పేకాట కేసులు నమోదు చేసి (25) మందిని అదుపులోకి తీసుకోని ₹ 3,81,830 /- రూపాయలు, 27 సెల్ ఫోన్స్ సిజ్ చేయడం జరిగింది. అట్టి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు నవాబుపేట PS పరిధిలోని గంగ్యాడ గ్రామ శివారులో ఉన్న మల్లేశం ( గంగ్యాడ మాజీ సర్పంచ్) ఫామ్‌హౌస్‌లో పేకాట స్థావరం పైన దాడి చేసి పేకాట ఆడుతున్న 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి 3,26,510/-రూపాయల నగదు,22సెల్ ఫోన్‌లు,05 కార్లు మరియు 06 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఇట్టి విషయం పైన నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.

బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బషీరాబాద్‌ మండలం నవాల్గ గ్రామంలో జిల్లా టాస్క్ఫోర్స్‌ బృందం పేకాట స్థావరం పైన దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 05 గురు వ్యక్తులను పట్టుకొని వారి నుండి 55,320/- రూపాయల నగదు మరియు 05 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment