వికారాబాద్ జిల్లా డిసెంబర్ 19 సమర శంఖమ్
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాల యందు విద్యాభ్యాసం చేయనున్న దివ్యాంగ విద్యార్థులు 2024 -2025సంవత్సరానికి గాను గాను ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకావాలని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిని బి. కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల వివరాలతో Telangana epass.gov.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నందు అందచేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నందు ఉన్న జిల్లా సంక్షేమ అధికారిని S9 కార్యాలయం రెండవ అంతస్తు వికారాబాద్ నందు సంప్రదించగలరు అలాగే ఏమైనా సమాచార నిమిత్తం 9502912981 ఫోన్ నెంబర్ ను సంప్రదించలని తెలిపరు.