క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లు జరగొద్దు… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

— ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అధికారులు పూర్తి అవగాహన ఉండాలి.. కలెక్టర్

— ఈ నెల 20 లోగా దరఖాస్తుల డాటా సేకరణ పూర్తి చేయాలి.. కలెక్టర్

— మండల అధికారులకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపిడివో లు, ఎంపీవోలు, మునిసిపల్ కమిషనర్ లకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమమని, తరతరాలుగా కుటుంబంలో మార్పు తెచ్చే కార్యక్రమమని అన్నారు. రొటీన్ కార్యక్రమంలా భావన వద్దని, ఒక పేదవారికి శాశ్వత ఇంటి హక్కు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుటుంబం బిపిఎల్ కేటగిరి కి చెందినదై ఉండాలని, లబ్దిదారు స్వంత స్థలం కానీ, ప్రభుత్వం అందించిన స్థలం కానీ కల్గి ఉండాలన్నారు. లబ్దిదారు సదరు గ్రామం, యుఎల్బి లో నివాసం కల్గి ఉండాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత క్రమం చూపాలన్నారు.పేర్లు, ఇంటి నెంబర్లు, డాక్యుమెంట్ల నమోదులో స్పెల్లింగ్ తప్పులు దొర్లకుండా ఖచ్చితమైన డాటా పొందుపర్చాలన్నారు. ఏ ఏ ఆధారాలు తనిఖీ చేయాలో, ఏవి పొందుపర్చాలో పూర్తి అవగాహన ఉండాలన్నారు.దరఖాస్తుదారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, ఏ ఏ వివరాలు, ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవాలో అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో ఇట్టి ఫ్లెక్సీలు ప్రదర్శించాలన్నారు. ముందస్తుగా రోజువారి, వారం వారి షెడ్యూల్ రూపొందించి, విస్తృత ప్రచారం చేయాలని ప్రజల్లో షెడ్యూల్ చేరుకునేలా చూడాలని అన్నారు.

ప్రతి రోజు కనీసం 30 దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకోవాలని, ఈ దిశగా లక్ష్య సాధనకు కార్యాచరణ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నెట్ వర్క్ బాగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకొని, నెట్ వర్క్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్ష్యాలను ప్రతిరోజూ మానిటరింగ్ చేయాలని కలెక్టర్ అన్నారు. శిక్షణ పొందిన మండల అధికారులు, వెంటనే తమ తమ మండలాలకు చేరుకొని క్షేత్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని, క్షేత్ర స్థాయి దరఖాస్తుల పరిశీలన శనివారం నుండే ప్రారంభం అవ్వాలని కలెక్టర్ తెలిపారు.శిక్షణ లో ఇడిఎం దుర్గాప్రసాద్, యాప్ ఇష్టల్లెషన్, యాప్ ఉపయోగ విధానం, లైవ్ ఉదాహరణ లతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డిఆర్వో రాజేశ్వరి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, ఆర్డీవోలు నర్సింహారావు, ఎల్. రాజేందర్, హౌజింగ్ ఇఇ శ్రీనివాసరావు, తహశీల్దార్లు, ఎంపిడివో లు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment