డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్​ బీఆర్​​ అంబేడ్కర్​ 68వ వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు నివాళులు అర్పించారు. దేశానికి అంబేడ్కర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలంటూ కొందరు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌ లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ కృషిని గుర్తుచేసుకున్న సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగానికి కట్టుబడే మోదీ సర్కార్‌ దేశంలో పాలన సాగిస్తోందని తెలిపారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం మాట్లాడుతూ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని అన్నారు. అన్నివర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్,మహిళా రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షురాలు జి.ప్రియా రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వింజమూరి గణేష్,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి,అంతటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment