ఫార్మసిస్టులకు శిక్షణ కార్యక్రమం: పెద్దపల్లి జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అన్నప్రసన్నకుమారి 

ఫార్మసిస్టులకు శిక్షణ కార్యక్రమం: పెద్దపల్లి జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అన్నప్రసన్నకుమారి

పెద్దపల్లి, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయములోని మినీ సమావేశ మందిరంలో శుక్రవారం అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో పనిచేయుచున్న ఫార్మసిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. అన్నా ప్రసన్న కుమారి శిక్షణ కార్యక్రమంలో నిర్వహించారు.

జిల్లా వైద్య అధికారిని మాట్లాడుతూ… మనిషి శరీరంలోని రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఉండవలసిన దానికంటే తక్కువగా ఉండడాన్ని అనీమియా అంటారని తెలిపారు.  ఈ హిమోగ్లోబిన్ శరీరంలోని మెదడుకు ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది అన్నారు. అందుకే రక్తం లోని హిమోగ్లోబిన్ ప్రాణదాత అని, స్త్రీలలో సగటున 13% హిమోగ్లోబిన్ ఉండాలి అని అన్నారు.

జిల్లాలో ఆరోగ్య కేంద్రాల పరిధిలో రక్తహీనత గల వారిని ఎలా అంచనా వేయాలని, వారికి ఎన్ని ఐరన్ పోలిక్ సిరపులు, ఎన్ని మాత్రలు అవసరం అనేది అంచనా వేయడం, ఇండెంటును నమోదు చేయడం, స్టాక్, రికార్డుల నిర్వహణ పై శిక్షణ ఇచ్చారు. స్టాక్ తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా, మందుల గడువులోపు ఎలా వినియోగించుకోవాలని, వాటిని నాణ్యత కోల్పోకుండా ఎలా భద్రపరుచాలో, అనీమియా ముక్త్ భారత్ కార్య క్రమంలో ఫార్మసిస్ట్ ల పాత్ర పై శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్. వాణిశ్రీ, ప్రోగ్రాం అధికారి సి.హెచ్.ఓ దయామని, ఫార్మసిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment