ఏపీలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి.
ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (VTPS) స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73MU విద్యుత్ ఉత్పత్తే అధికం. ఇతర థర్మల్ కేంద్రాల్లో 123.055MU, హైడల్ 9.411MU, తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. ఏపీజెన్కో చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని సంస్థ ఎండీ కేవీఎస్ చక్రధరబాబు తెలిపారు.