సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగివుండాలి
సైబర్ నేరాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఎస్‌ఐ జనార్ధననాయుడు అన్నారు. ఉరవకొండ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపైన ఆటోల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆనలైన గేమ్స్, బెట్టింగ్, లోనయా్‌పలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఫోనలు వస్తే 1930కి కాల్ చేయాలన్నారు. హెడ్‌కానిస్టేబుళ్లు అంజయ్య, జాఫర్, సిబ్బంది పాల్గొన్నారు.అలానే యల్లనూరు మండలంలో శనివారం సైబర్ నేరాలపై స్థానిక పోలీసులు గ్రామాల్లో అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు కాల్‌చేయాలని వివరించారు. జంగంపల్లి, పాతపల్లి, వెన్నపూసపల్లి గ్రామాల్లో ఆటో ద్వారా టామ్‌టామ్ వేయించారు.
కాగా యాడికి ప్రాంతంలో సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ ఈరన్న సూచించారు. శనివారం పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రుణయా్‌పల పట్ల జాగ్రత్తలు అవసరమని అన్నారు. ఏఎ్‌సఐ వెంకటేష్, హెడ్‌కానిస్టేబుల్ రంగనాయకులు పాల్గొన్నారు. అలానే పుట్లూరులో సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ వెంకటనరసింహం అన్నారు. మండలంలోని కడవకల్లులో శనివారం ఆటోతో ప్రచారం ప్రారంభించి, అవగాహన కల్పించారు. అలానే కూడేరులో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. శనివారం మండల కేంద్రంలో సైబర్ నేరాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తున్నారని, తెలియని ఫోన్లు వస్తే ఎటువంటి సమచారం ఇవ్వకూడదని ఏఎ్‌సఐలు రామానాయుడు, శివశంకర్ కోరారు. కానిస్టేబుళ్లు మహింద్ర, నరేష్ పాల్గొన్నారు.