అందని ఎస్సారెస్పీ జలాలు..ఆగని రైతుల ఆందోళనలు..

అందని ఎస్సారెస్పీ జలాలు..ఆగని రైతుల ఆందోళనలు..

నీటిని విడుదల చేసేంతవరకు ధర్నా ఆపమని భీష్మించిన రైతులు..

వేసవికాలం వరి పంట సాగుకు ప్రతి సంవత్సరం ఎస్సారెస్పీ జలాలు వస్తుండడంతో ఈ సంవత్సరము కూడా ఎస్సారెస్పీ జలాలు వస్తాయని ఆశతో రైతులు తమ పంట పొలాలను చదును చేసుకుని వరి పంటలు నాటారు. వరి పంటలు పొట్టదశకు వచ్చాయి.కాగా ఎండలు రోజురోజుకు పెరుగుతుండడంతో వారికి గల బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు పోయక పంటలు ఎండుతున్నాయని, ఎస్సారెస్పీ జలాలను విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని , అధికారులను వేడుకున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈమధ్య పలుమార్లు రైతులంతా కలిసి ధర్నా నిర్వహించడంతో ఎస్సారెస్పీ జనాలను విడుదల చేస్తామని చెప్పిన అధికారులు నేటికీ విడుదల చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు మండల పరిధిలోని ఎర్ర పహాడ్ ఎక్స్ రోడ్డు వద్ద సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అధికారులు దిగివచ్చి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చేంతవరకు ధర్నాను విరమించి లేదని భీష్ముంచుకొని కూర్చున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment