సబ్ స్టేషన్ ముట్టడించిన మర్పల్లి గ్రామ రైతులు

---Advertisement---

– ఐదు రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయిన పట్టించుకోని విద్యుత్ శాఖ సిబ్బంది.

– ఏఈ యాసిన్ అలీ హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు

రేగోడు సమర శంఖమ్ న్యూస్  వ్యవసాయ క్షేత్రాల్లో ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయి ఐదు రోజులు కావస్తున్నా మర్పల్లి విద్యుత్ శాఖ ఆర్టిషన్ కిషన్ నాయక్ కు తెలిపినా పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా మండల కేంద్రమైన రేగోడు విద్యుత్ సబ్ స్టేషన్ ను మర్పల్లి గ్రామ రైతులు గురువారం బేగరీ రవి, జి అనిల్, బి. చక్రపాణి, ప్రకాష్ ,ప్రేమ్ కుమార్ ,ప్రవీణ్ శ్రీశైలం, సందీప్ దివాకర్, లతో పాటు పలువురు రైతులు సబ్ స్టేషన్ ముట్టడించి బిల్డింగ్ పై ఎక్కి ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ మర్పల్లి విద్యుత్ శాఖ ఆర్టిషన్ కిషన్ నాయక్ కు ఐదు రోజుల నుండి పలుమార్లు ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయిందని సమాచారం ఇచ్చిన పట్టించుకోడం లేదని, పంటలు ఎండిపోతు న్నాయని ,పశువులకు కూడా త్రాగడానికి నీళ్లు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా అయ్యేంతవరకు సబ్ స్టేషన్ బిల్డింగ్ పై నుండి దిగేది లేదని భీష్మించి కూర్చున్నారు విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని అప్పటివరకు సబ్ స్టేషన్ నుండి వెళ్లిపోయేది లేదని సబ్ స్టేషన్ వద్ద కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ మల్లయ్య ఆయన సిబ్బందితో సబ్ స్టేషన్ వద్దకు వచ్చి నచ్చచెప్పిన తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని మా సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వెళ్లేది లేదని రైతులు అన్నారు. ఏఈ యాసీన్ అలీ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఏఈ ట్రాన్స్ ఫార్మర్ మర్మత్తులు చేయించి విద్యుత్ సరఫరా చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.గ్రామస్తులతో కలిసి ఏఎంసీ డైరెక్టర్ భద్ర రెడ్డి ,విద్యుత్ ఏఈ కి వినతి పత్రం అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment