మహిళా సాధికారతతోనే ఆర్థిక పరిపుష్టి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
ఆడపిల్లల బంగారు భవిష్యత్తు ఆర్థిక సాధికారతకై పనిచేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బహదూర్ పల్లి కెఎం.పాండు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆవరణలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై 337 మంది విద్యార్థినిలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున 26.72 లక్షల రూపాయల విలువగల స్కాలర్ షిప్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య అని, ఆడపిల్ల విద్యాభివృద్ధితోనే కుటుంబం ఆర్థిక పరిపుష్టిని సాధిస్తుందని నమ్మి ఆడపిల్లల విద్యకై జాతీయ స్థాయి స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని మహిళల సాధికారతకై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 95,000 మందికి స్కాలర్ షిప్పులను అందించడం మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలోని 337 మంది విద్యార్థినులకు 26.72 లక్షల రూపాయలను స్కాలర్ షిప్ రూపంలో అందించడం అత్యంత అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో ఆడపిల్లల విద్యాభివృద్ధికై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జోనల్ హెడ్ షణీబ్.కె, కూకట్ పల్లి స్టోర్ మేనేజర్ మహమ్మద్ ఇర్ఫాన్, కె.పి.హెచ్.బి స్టోర్ మేనేజర్ శ్రీనివాస్. కెఎన్, మార్కెటింగ్ హెడ్ రాకేష్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయిన్ సెక్రెటరీ డాక్టర్ ఆర్. జోత్స్న రాణి, కుత్బుల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అలివేలు మంగమ్మ, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ మైమూన్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేంద్రరావు, కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటయ్య, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, దుండిగల్ మాజీ కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.