అనాథ పిల్లలకు ఫిస్ట్ ఫుల్ ఆఫ్ రైస్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళ డిగ్రీ కళాశాలలోని వృక్షశాస్త్ర అటానమస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిస్ట్ ఫుల్ ఆఫ్ రైస్ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిందని ప్రిన్సిపల్ అమీనా ముంతాజ్ తెలిపారు.
సేకరించిన బియ్యాన్ని గురువారం ఏగొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ అనాథ పిల్లలకు పంపిణీ చేశారని తెలిపారు. అటానమస్ కార్యక్రమంలో భాగంగా తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టి అనాథ పిల్లలకు తోడుగా నిలిచామని అన్నారు.