ఆస్పత్రికి వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.రెగ్యులర్ చెకప్ (లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకు తన ఫామ్ హౌస్ లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఈ ఘటన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలను తన ఫామ్ హౌస్ నుంచి నిషితంగా పరిశీలిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాత ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ (Farm house) నుంచి బుధవారం బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ (BRS party) స్థాపించి 25 సంవత్సరాలు కావస్తుండటంతో.. నిన్న తెలంగాణ భవన్లో (Telangana Bhavan) కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.