ఫార్ములా-ఈ కేసు విషయంలో నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా: మాజీ మంత్రి కేటీఆర్

ఫార్ములా-ఈ కేసు విషయంలో నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అవినీతి జరగనే లేనప్పుడు.. అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయట పెట్టడంతో.. ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సస్పెండ్ చేస్తాను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. మరి ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి.. వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని అనుమానంగా ఉంది. అనుచిత లబ్ధి పొందింది ఫార్ములా ఈ సంస్ధ వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు.

ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అతనితో కాంట్రాక్టర్లకు రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నాడు. దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉందా?

ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ.. అవినీతి అని కేసులు పెట్టడం వృధా. హైదరాబాద్ పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరిగే అవకాశమే లేదు.  కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం లో మరిన్ని విషయాలు చెప్పలేను.

ఏసిబి ఎఫ్ఐఆర్ ని కొట్టివేయలని హైకోర్టులో కేసు నమోదు చేశాను. ఈడి నోటీసులు వచ్చిన మాట వాస్తవమే.. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడి దూకుడుగా వ్యవహరిస్తుంది – చిట్ చాట్లో కేటీఆర్

Join WhatsApp

Join Now

Leave a Comment