‘ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందజేస్తామని అబద్ధపు హామీలను ఊదరగొట్టాడు. మాజీ మంత్రి కేటీఆర్

‘ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందజేస్తామని అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. ఏడాది తర్వాత మండలంలో ఒక గ్రామానికి పథకాలంటూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మండలానికి ఒక గ్రామం యూనిట్‌గా చేసుకొని రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటించడం తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.మండలానికి ఒక గ్రామంలోనే మీరు ఎన్నికల ప్రచారం చేశారా? మీ గ్యారెంటీ కార్డులిచ్చారా? మండలానికి ఒక గ్రామంలో ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చారా? అని భట్టిని నిలదీశారు. పథకాలు రాని గ్రామాల్లో రేపటినుంచి ప్రజా రణరంగమేననిహెచ్చరించారు. కాగా, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం ఆ సామాజిక వర్గానికి దక్కిన గౌరవమని కేటీఆర్‌ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment