సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

 మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిరిన పూజ కార్యక్రమాల్లో భాగంగా చివరిరోజు పూజ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం 8.45గంటలకు విగ్రహాల ప్రతిష్టాపన, మధ్యాహ్నం 1గంటల నుండి 3గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ పూడూరు లోని నూతన సాయి బాబా ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సాయి బాబా ఆశీస్సులతో ప్రజలందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నాననారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ గొల్లం పల్లి వేంకటరమణారెడ్డి, మేడ్చల్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

Join WhatsApp

Join Now

Leave a Comment