తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ కోరారు. మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల నాయకుడు అంటే రాజగోపాల్ రెడ్డి అని ఆమె అన్నారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉన్న మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ని ఈ ప్రాంతాన్ని సేవ చేసేందుకు ప్రజలు గెలిపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లే దిశగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేక పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపించిన నాయకుడు రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి అని వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించి ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానికం కోరుకుంటుందని పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ తెలియజేశారు.
మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చోటు కల్పించాలి… తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్..
Published On: December 16, 2024 4:34 pm
