జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు… మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ..

జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు… మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ..

మునుగోడు నియోజకవర్గం స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం చౌటుప్పల్ పి బి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్..

మాజీ ఎమ్మెల్యే కోసుకుంట ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ

– తెలంగాణ సాధించుకున్నాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల మన్నలను పొందాయి

– ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ ప్రజలు కోరినవే కాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు

– కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెప్పుకొని ఇప్పుడు రైతుని బజారు పాలు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

– కృష్ణ బేసిన్ నుంచి మన వాటాన్ని మనకు ఇవ్వకుండా అదనంగా నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్న పట్టించుకోని చేతకాని ప్రభుత్వం

– జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు

– ఆంధ్ర తొత్తులుగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

– తెలంగాణ ప్రభుత్వానికి 12 మంది సలహాదారులు ఉండగా అందులో ఎనిమిది మందిని ఆంధ్ర పాలకుల తొత్తులను నియమించుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం గా కనబడుతుంది

– టోపీ తెలంగాణకు పెట్టి లాటితో ఆంధ్ర పాలకులు పెత్తనం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు

– తెలంగాణ ముఖ్యమంత్రి మరి కొందరు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు శిష్యులు, తొత్తులుగా పనిచేస్తున్నారు

– కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ టు ఢిల్లీ ప్రయాణం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు

– ఇప్పటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ద్వారా వచ్చిన ఎన్నికల ద్వారానే మునుగోడు అభివృద్ధి చెందింది అనడం ఒట్టి అబద్ధమని ఆ నిధులను బీ ఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిధులేనని గుర్తుంచుకో

– మంత్రి పదవి కోసం ఉరుకులాట తప్ప మునుగోడు ప్రజలకు సంవత్సరకాలంలో చేసింది ఏమీ లేదు

– మంత్రి పదవి రాకపోతే కంత్రి గా మారుతాడు రాజగోపాల్ రెడ్డి

– గత పది సంవత్సరాలుగా ఇంటింటికి నీటిని సరఫరా చేసినం ఇప్పుడు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు

– బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment