స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..
మునుగోడు ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారము స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని ఎల్లంబాయి స్థానిక ఎన్నికల ఇన్చార్జిలు సుర్వి నరసింహ గౌడ్ మరియు చెరుకు లింగస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. ఈరోజు ఎల్లంబాయ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, సుర్వి నరసింహా గౌడ్, చెరుకు లింగస్వామి గౌడ్, పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి అన్నారు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కార్యకర్తల పని చేశారో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచి అభ్యర్థులు గెలుపు కోసం అదే విధంగా పని చేయాలని అన్నారు., ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.