ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నలుగురు మృతి..

హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆగి ఉన్న లారీని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలను ఛత్తీస్ ఘడ్ నుండి హైదరాబాదుకు తీసుకు వెళుతుండగా ఢీ కొట్టింది. ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉండగా నలుగురు చనిపోయినట్లు సమాచారం ఎనిమిది మంది గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డీఎస్పీ రవి ఆధ్వర్యంలో పోలీసులు సహా చర్యలు చేపట్టి రోడ్డు క్లియర్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment