– సాయం కోరిన మహిళకు కుచ్చుటోపీ
– నకిలీ కార్డు ఇచ్చి ఒరిజన్ కార్డుతో జంప్
– కాసేపటికే అకౌంట్లో నగదు మాయం
తాండూరు: ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు సాయం కోరిన ఓ మహిళకు కంత్రి కేటుగాటు కుచ్చుటోపి పెట్టాడు. ఆమెకు చెందిన అసలైన ఏటీఎం కార్డును మార్చి నకిలీ ఏటీఎం కార్డును అంటగట్టి జంప్ అయ్యాడు. కాసేపటికే మరో ఏటీఎం వద్ద ఆమె ఖాతాలోని నగదును లూటీ చేశాడు. అయ్యో పాపం అనిపించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్‌కు చెందిన శోభ వెంకటేశ్వర పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉంది. ఇటీవలే ఆమెకు పొదుపు సంఘం నుంచి డబ్బులు వచ్చాయి. సోమవారం పట్టణంలోని మల్లప్ప మడిగ సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లింది.
ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్యాంకులో ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లింది. ఆమెకు ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియక అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని సాయం కోరింది. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును అతనికి ఇవ్వడమే కాకుండా ఏటీఎం పిన్ నెంబర్ కూడా చేప్పేసింది. ఇదే చాన్స్‌గా బావించిన కేటుగాడు