మంచిర్యాల: వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
మంచిర్యాల, మార్చి18, సమర శంఖం ప్రతినిధి:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కేర్ హోమియోపతి సహకారంతో వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో మంగళవారం పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ యొక్క వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి డాక్టర్ వినయ్ పరశురాం ఉచిత సలహాలు, సందేహాలను తీర్చడం జరిగినది.
ఈ సందర్భంగా దాదాపు 75 మందికి మల్టీ విటమిన్, బాడీ పెయింట్స్, గ్యాస్ ట్రబుల్, సైనస్ (తుమ్ములు,దగ్గు, జలుబు) సంబంధించిన మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వంద మందికి పైగా బీపీ, బరువు పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆకుల సత్యన్న, అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, కార్యదర్శి పుప్పిరెడ్డి రామిరెడ్డి సలహాదారులు కార్యవర్గ సభ్యులు ఎం. రంగారావు, బి లక్ష్మీనారాయణ గౌడ్, గోలి మనోహర్రావు, కె.వి కృష్ణారావు, పర్వతాలు యాదవ్, గోపన్న, సంపత్ కుమార్, డాక్టర్ ఏ ఎమ్ రెడ్డి, చైర్మన్ డాక్టర్ కేర్ హోమియోపతి మేనేజర్ నేరెళ్ల రమేష్, ఫార్మసిస్ట్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.