ఇకనుండి ATM ద్వారా పిఎఫ్ డబ్బులు విత్ డ్రా సౌకర్యం

ఇకనుండి ATM ద్వారా పిఎఫ్ డబ్బులు విత్ డ్రా సౌకర్యం

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ క్రమంలో త్వరలో UPI ఆధారిత PF ఉపసంహరణ ప్రారంభం కానుంది. ఈ కొత్త సౌకర్యం ద్వారా EPFO సభ్యులు UPI ద్వారా వారి PF డబ్బులను క్షణాల్లోనే ఉపసంహరించుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల PF క్లెయిమ్ ప్రక్రియ వేగవంతమవుతుందని, అర్హత ఉన్న సభ్యులకు వెంటనే డబ్బు అందుతుంది.

ఎప్పటి నుంచి ప్రారంభం..?

అయితే EPFO ఇప్పటికే ఈ పనులను ప్రారంభించింది.. ఇది మే చివర లేదా జూన్ ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు, PF డబ్బులను ఉపసంహరించుకువడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసిన క్రమంలో రెండు మూడు రోజల్లో ఆయా సభ్యుల ఖాతాల్లోకి క్రెడిట్ అవుతుంది. కానీ తర్వాత వచ్చే రోజుల్లో మాత్రం PF ఖాతా దారులు మరింత తక్కువ సమయంలో డబ్బులను తీసుకునే ఛాన్సుంది. UPI లింకప్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

PF డబ్బు ఉపసంహరించుకోవడం ఎలా..?

EPFO సభ్యులు UPI ఐడీని లింక్ చేసుకోవడం ద్వారా వారి PF డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాకు వెళతాయి. UPI ద్వారా సభ్యులు రూ. 1 లక్ష వరకు ఆటోమేటిక్‌గా PF డబ్బులను ఉపసంహరించుకునే ఛాన్సుంది. EPFO తన 120 కంటే ఎక్కువ డేటాబేస్‌లను అనుసంధానించి, 95% క్లెయిమ్‌లను ఇప్పటికే ఆటోమేటెడ్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment