స్థానిక జలగం నగర్ లోని బాలురు రెసిడెన్షియల్ పాఠశాల కు జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో సోమవారం మరమ్మత్తులు నిర్వహించిన 70 బెంచి లను వితరణ చేశారు. ఇటీవల మున్నేరుకు వచ్చిన వరద వల్ల పాఠశాలలో సామాగ్రి పూర్తిగా దెబ్బతింది. వరదలతో విద్యార్థులు కూర్చునే బెంచిలు కూడా దెబ్బతిన్నాయి. కాగా , పాఠశాలకు సందర్శనకు వచ్చి , పరిస్థితులను పరిశీలించిన జమాతే ఇస్లామి హింద్ నాయకులు బెంచిలు దెబ్బతినడంతో విద్యార్థులు నేలపైనే కూర్చుని ఉండటం , అలాగే పాఠాలు వింటుండటం గమనించారు. దీనితో చలించిన జమాతే ఇస్లామీ హింద్ నాయకులు మరమ్మతులకు హామీ ఇచ్చారు. 16 వేల రూపాయల వ్యయంతో 70 బెంచిలకూ మరమ్మత్తులు తలపెట్టి , పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా, ఉపాధ్యక్షుడు అబ్దుల్ సమీ , ఖిల్లా అధ్యక్షులు అబ్దుల్ మలిక్ , వార్డెన్ మహమ్మద్ రఫీ , ఆఫీస్ సబార్డినేట్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు జే ఐ హెచ్ బెంచిలు బహుకరణ
Published On: December 10, 2024 7:34 am
