పోలింగ్ రోజు ప్రైవేటు స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వండి. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రకటన!

పోలింగ్ రోజు ప్రైవేటు స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వండి. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రకటన!

“ఈనెల 27న గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ ను మంజూరు చేసింది. కానీ చాలా కళాశాలల్లో, పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన సిబ్బందికి కొన్ని గంటలు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెబుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.‌ కచ్చితంగా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఓటు కలిగిన సిబ్బందికి రోజంతా సెలవు దినాన్ని ప్రకటించాలి.‌

వారికి ఏడాదిలో అందించే సిఎల్ లకు వీటికి సంబంధం లేకుండానే అదనంగా పోలింగ్ రోజు సెలవు దినంగా అవకాశాన్ని ఇవ్వాలి. ఎక్కడైనా పట్టబద్రులు సిబ్బందికి ఉన్నచోట ఇబ్బంది కలిగిస్తే నేరుగా బిజెపి నాయకులకు కార్యకర్తలకు ఫిర్యాదు చేయండి. మీ పేరు గొప్యంగా ఉంచుతాం. ఆ కళాశాల యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకుంటాం. ఓటు ప్రజాస్వామ్యం కలిగించిన హక్కు. దాన్ని వినియోగించుకునే హక్కు మీకే ఉంది. ఆపే అధికారం ఎవరికి లేదు.”బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

Join WhatsApp

Join Now

Leave a Comment