వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్
AP: వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో వేసవి దృష్ట్యా చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండాలనీ, తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.