ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది : గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని వివరించారు. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను గవర్నర్‌ ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు నిధులు సమకూర్చిందన్నారు. అమరావతిలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభించేందుకు సహకారం అందించిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా కృషి చేసినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యంగా తమ ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ప్రధాని కలలు కన్న వికసిత్‌ భారత్‌ లక్ష్యాలు సాధించే దిశగా నడుస్తున్నామన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment