*పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్మన్*
యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ సమర శంఖమ్ :-
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పంబా ఆరట్టు మహోత్సవం సందర్భంగా శనివారం రోజు సాయంత్రం భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు , మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. అనంతరం సి. వెంకటేష్ శర్మ గురు స్వామి ప్రధాన తాంత్రి వర్యులు ఆధ్వర్యంలో పంబా ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి , భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ , కౌన్సిలర్లు పోత్నక్ ప్రమోద్ కుమార్ , రత్నపురం బలరాం , ఈరపాక నర్సింహ , కైరంకోండ వెంకటేష్ , ఏవి కిరణ్ , ఉదారి సతీష్ , బోర్ర రాకేష్ , అందె శంకర్ , ఆంజనేయులు , దిడ్డికాడి భగత్ , కొడారి వినోద్ , అనురాధ , ఎల్లమ్మ , తంగేళ్లపల్లి శ్రీవాణి , కోళ్ల గంగాభవాని , చెన్న స్వాతి , వడిచెర్ల లక్ష్మి , వెంకట్ నాయక్ , పచ్చల హేమలత , పడిగెల రేణుక మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంతో పురవీధుల గుండా ఊరేగించి భువనగిరి పెద్ద చెరువులో అఖండ నవాభిషేకములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.