ఎస్ఎల్‌బీసీ ఘటనపై ప్రభుత్వ తీరు బాధాకరం: హరీశ్ రావు
TG: SLBC ఘటనపై తెలంగాణ ప్రభుత్వ తీరు బాధకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడ నల్లగొండ జిల్లాలకు చెందిన నాయకులు SLBC టన్నెల్ వద్దకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని.. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఏజెన్సీలను మన్వయం చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదనన్నారు.