హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన వాక్యాల పై ప్రభుత్వ విప్ ఫైర్
నోరు అదుపులో పెట్టుకో హరీష్ రావు..కోమటిరెడ్డి జోలికి వస్తే నాలుక కోస్తాం.
ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.
యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 18 సమర శంఖమ్
అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డిపై హరీష్ రావు చేసిన వాక్యాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య ఖండిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి పక్ష నాయకుడు తాగి ఫామ్ హౌస్ లో పడుకుని ఉంటే ఇక్కడ మాత్రం హరీష్ రావు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పై ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. వాళ్ళ మామాను దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు ఈ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రతి పక్ష నాయకుడు తన బాధ్యతను నిర్వర్తించకుండా తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని , మీకు ఉన్న అలవాట్లు మాకు ఉన్నాయని అనుకోవటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. గతంలో ఇప్పటి ప్రతి పక్ష నాయకుడు తాగి హెలికాప్టర్ నుండి కిందపడ్డ విషయం అందరికి తెలిసిన విషయమే అన్నారు.
తెలంగాణ కోసం అగ్గిపెట్ట దొరకలేదని డ్రామాలు ఆడిన మీరు ఈరోజు తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తాగ్యం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై వాక్యాలు చేయడం సిగ్గుమాలిన చర్య అని మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని హరీష్ రావు మాట్లాడాలన్నారు. లేనియెడల ఎవరు క్షమించారన్నారు.