డిసెంబర్ 29, నారాయణపేట క్రైమ్:(సమర శంఖమ్)
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలానికి చెందిన చాపలి భాస్కర్ పాత నేరస్తుడు. గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో మక్తల్, ఊట్కూరు,మద్దూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు.2018 ఆగస్టు 10న పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకొని కొంతకాలం బెంగళూరు..హైదరాబాద్ లో ఉంటూ కూలీ పని చేశాడు. గత రెండు సంవత్సరాల క్రితం నారాయణపేట మరికల్, మక్తల్,కొడంగల్,బొంరాస్ పేట,పరిగి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదని తిరిగి మరికల్ లో దొంగతనం చేసేందుకు యత్నించగా పోలీసులకు చిక్కినట్లు డిఎస్పి తెలిపారు. సుమారు నారాయణపేట్, మరికల్, మక్తల్, కోస్గి పోలీస్ స్టేషన్లో పరిధిలో సుమారు 13 కేసుల్లో చాపలి భాస్కర్ నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.19 లక్షల విలువ చేసే బంగారం,రూ.1 లక్ష 50 విలువ చేసే వెండి రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు.