హీరోయిన్గా మోనాలిసా.. హీరో ఇతడే
మహాకుంభమేళాలో పూసలమ్మిన మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. మోనాలిసాకు తన సినిమాలో ఆఫర్ ఇస్తానని ప్రకటించిన దర్శకుడు సనోజ్ మిశ్రా తాజాగా ఆమె ఇంటికెళ్లారు. ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. సినిమా షూటింగ్కి ముందు ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఇందులో రాజ్కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు టాక్..