మహిళకు గుండెపోటు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతార్‌కు చెందిన విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానం దోహ నుంచి బంగ్లాదేశ్ వెళ్తుండగా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ గుండెపోటుకు గురైంది. దీంతో సదరు మహిళకు చికిత్స కోసం పైలెట్ ఫ్లైట్‌ను శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆ మహిళ మరణించింది.