పెద్దపల్లి: మానవత్వం పరిమళించిన ఘటన… మతి స్థిమితం లేని మహిళకు సహాయం..

పెద్దపల్లి: మానవత్వం పరిమళించిన ఘటన… మతి స్థిమితం లేని మహిళకు సహాయం..

_మతి స్థిమితం లేని అనాధ మహిళను సురక్షిత ప్రదేశానికి చేర్చాలని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్

_సఖి కేంద్రానికి తరలింపు

_స.హ.చట్టం కార్యకర్త , సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ

పెద్దపల్లి, మార్చి 25, సమర శంఖం ప్రతినిధి:- సొంత మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో  మానవత్వం పరిమళించిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.

పెద్దపల్లి టౌన్ లో ఎం.బి.ఫంక్షన్ హాల్ ముందు మానసిక స్థితి బాగా లేని అనాథ మహిళ (సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలు) గత నెల రోజుల నుండి రోడ్డు పక్కన ఉంటుందని, ఈ మహిళ ఉన్న స్థలం నుండి కదలడం లేదని, మాట కూడా ఎవరితో మాట్లాడడం లేదని, ఎవరన్నా తినడానికి ఏదైనా ఇస్తే, తింటుందని రోజంతా ఎండలోనే ఉంటుందని, పూర్తి అడ్రస్ ఎవరికి తెలియడం లేదని, ఆ మహిళ ఎవరితో మాట్లాడడం లేదని, ఈ మహిళను ఏదైనా ప్రభుత్వ వసతి గృహం కు, సురక్షిత ప్రదేశాన్ని చేర్చాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త, సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ, మంథని వెంకటేశ్వర్లు, ఐతే లక్ష్మీ నరసయ్య వీరు ముగ్గురు కలిసి ఈ నెల 19 తేదీన ప్రత్యక్షంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసి మతి స్థిమితం లేని మహిళకు భద్రత, రక్షణ కల్పించాలని ఫిర్యాదు, దరఖాస్తును ఇచ్చారు.

కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో మంగళవారం సఖి సెంటర్, సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ స్వప్న వారి సిబ్బందితో వచ్చి ఆ మానసిక స్థితి బాగా లేని మహిళను సఖి సెంటర్ కు తరలించారు.

ఈ సందర్భంగా బొబ్బిలి సత్యనారాయణ మాట్లాడుతూ తాను తన మిత్రులు మంథని వెంకటేశ్వర్లు, ఐతే లక్ష్మీ నర్సయ్య కలిసి ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కి, జిల్లా సంక్షేమ అధికారులకు , సఖి సెంటర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆ మతిస్థిమితం లేని అనాధ మహిళను సఖి సెంటర్ కు చేర్చిన తర్వాత అక్కడ నుండి అమ్మానాన్న అనాధ ఆశ్రమం చౌటుప్పల్ , యాదాద్రి భువనగిరి కి తరలిస్తామని సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ స్వప్న తెలిపారు. సురక్షిత ప్రదేశానికి చేర్చి ఆమె మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని, భద్రత, రక్షణ కల్పించు ప్రదేశంలోకి పంపించాలని. బొబ్బిలి సత్యనారాయణ కలెక్టర్ ను ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment