ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు తన వెంట న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఏసీబీ విచారణ సమయంలో కనిపించే అంత దూరంలో న్యాయవాది ఉండాలని, ఒక గదిలో ఇన్వెస్టిగేషన్, మరో గదిలో న్యాయవాది ఉంటే తప్పేముందని తెలిపారు. న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా డిస్టెన్స్ ఏసీబీ ఆఫీసులో ఉందో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తికి హైకోర్టు సూచించింది
కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
Published On: January 8, 2025 6:41 pm
