మహిళా జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యత: సమాచారశాఖ కమిషనర్ హరీష్

మహిళా జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యత: సమాచారశాఖ కమిషనర్ హరీష్

హైదరాబాద్, మార్చి 10, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాదాన్యత ఇస్తున్నదని సమాచార శాఖ కమిషనర్ హరీష్ అన్నారు.

మీడియా అకాడమి భవన్లో ఆదివారం మహిళా జర్నలిస్టులకు “ఆన్-లైన్ జర్నలిజం-మహిళా జర్నలిస్టుల పాత్ర” అంశంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ హరీష్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారిలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిజంలో మహిళా ప్రాతినిధ్య మరింత పెరగాలని మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎస్.బి డేటా సైన్స్ ప్రొఫెసర్ మది విశ్వనాథం, ఏఐ నిపుణుడు రాకేష్, ఐ.ఎస్.బి డేట సైన్స్ కాలేజీ డైరెక్టర్ శృతి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మాధవి రవికుమార్, పలు అంశాలపై వివరించారు. వివిధ ప్రాంతాల నుండి పలువురు మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment