సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
రామగుండం, మార్చి 13, సమర శంఖం ప్రతినిధి:- ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండ , మహిళ పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలి జరుపుకుందామని రామగుండము పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
హోలీ పండుగ సందర్బంగా రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిశోరే ఝా ప్రజలకు పలు సూచనలు చేశారు. సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచనలు చేశారు. ప్రధానముగా బహిరంగ ప్రదేశాలపై, అనుమతి లేకుండా వ్యక్తులపై, మహిళలు, యువతులు, వాహనాలపై రంగులు చల్లడం బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
హోలీ పండుగను సజావుగా జరుపుకొనేందుకు రామగుండము పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని ప్రకటించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.