విశాఖపట్నం: విశాఖ భీమిలిలో హనీట్రాప్ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వాసి రామారావుకు ఈనెల 18న ఓ యువతి ఫోన్ చేసింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా మరోసారి ఆమె నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని చెప్పింది. రామారావు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి దాకమర్రిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు వద్ద ఉన్న రూ.48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ఇవాళ మరో రూ.7వేలు కాజేశారు. నగదు మాయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ భీమిలిలో హనీట్రాప్ ఘటన కలకలం
Published On: January 24, 2025 2:54 pm
