ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలి…

మునుగోడు డిసెంబర్ 17: సమర శంఖమ్ 

ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గూడపూర్ అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం మండల తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గూడపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 11, 12, 13, 14, 15, 16, 17 లలో ప్రభుత్వం మిగులు భూములు ఉన్నాయని, ఈ భూములు ఊరికి మధ్యలో మునుగోడు-నల్లగొండ రహదారికి ఇరువైపుల, కొత్త కాలనీకి, గ్రామానికి, శాంతినికేతన్ హై స్కూల్ వరకు విస్తరించి ఉన్నాయని, పైన పేర్కొన్న సర్వే నెంబర్ల భూములను సర్వే చేయించి ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలను గుర్తించి పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు దర్శనం వేణు కుమార్, ఖమ్మం పార్టీ నరసింహ, వేముల శ్రీరంగం మేడి పెద్దులు, అక్కనపెల్లి సతీష్, దేశిడి వెంకన్న, బి ఆర్ ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ నన్నూరి భూపతి రెడ్డి, దెందె మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సింగపంగా మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పరి యాదగిరి, సిపిఎం సీనియర్ నాయకులు పగడాల కాంతయ్య, అక్కనపల్లి నరసింహ, దేశిడి లక్ష్మయ్య, దేశిడి…., లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment