రాచకొండ కమిషనరేట్ రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి సర్వే చేస్తున్న హైడ్రా అధికారులు…మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడం పై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమీషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాధ్…త్వరలో కమీషనర్ పై యాక్షన్ తీసుకునే చాన్స్…చెరువు భూమిలో ఎలా రోడ్డుకు నిధులు కేటాయిస్తారని ప్రశ్నించిన రంగనాధ్. సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు,పట్టా భూమి బార్డర్ లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి సూచించిన హైడ్రా కమీషనర్ చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశం. రోడ్డు నిర్మాణంలో థర్డ్ పార్టీ చేశారని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి హైడ్రా కమిషనర్ కు వివరించారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఈ రోడ్డు విషయం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు థర్డ్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు వారిపై కేసులు పెట్టాలి కదా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అన్నారు.