అడవులకు నిప్పు పెడితే చర్యలు తప్పవు

అడవులకు నిప్పు పెడితే చర్యలు తప్పవు

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. కొండలు, అడవులు ఎందుకు అంటుకుంటాయే తెలియదు. కానీ ఎక్కడ చూసినా మంటలు మండుతూనే ఉంటాయి. అడవులకు నిప్పు పెట్టడం చాలా ప్రమాదకరమైన చర్య, అలాగే చట్టవిరుద్ధమైన పని. దీని వలన అనేక రకాల నష్టాలు కలుగుతాయి. అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అంటే వృక్ష సంపద ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. అడవులకు నిప్పు పెట్టడం వలన అనేక రకాల వృక్షాలు కాలిపోతాయి. దీని వలన అటవీ ప్రాంతం చాలా వరకు తగ్గిపోతుంది. ముగ వన్యప్రాణుల నష్టం. అడవులలో నివసించే జంతువులు, పక్షులు, కీటకాలు ఇలాగా ఎన్నో ఇతర మూగ జీవులు అగ్గిలో అహుతి అయిపోతాయి లేదా వాటి ఆవాసాలు నాశనం అవుతాయి. పర్యావరణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. అడవులు కాలిపోవడం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరుగుతుంది. దీని వలన గ్లోబల్ వార్మింగ్ సమస్య మరింత తీవ్రమవుతుంది. అడవుల వల్ల నేల కోతను నివారించవచ్చు. అడవులు కాలిపోతే నేల కోత ఎక్కువ అవుతుంది. అడవుల వల్ల నీటి ప్రవాహం నియంత్రించబడుతుంది. అడవులు కాలిపోతే నీటి వనరులు ఎండిపోతాయి. అడవులను ఎలా రక్షించాలి? అడవులకు నిప్పు పెట్టకూడదు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment