నీళ్లను పొదుపుగా వాడాలి.. లేకుంటే భవిష్యత్తు లేదు
_వరల్డ్ వాటర్ డే సదస్సులో వక్తలు
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భారత వ్యవసాయ ఇంజనీర్ల సంఘం తెలంగాణ రాష్ట్ర విభాగం కొంగర కలాన్ లోని శ్లోకా కన్వెన్షన్ లో తెలంగాణ జల వనరులు & నీటి యాజమాన్యం పై విస్తృత చర్చ పైన ఒక సదస్సును నిర్వహించారు.
చాలామంది జాతీయ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలతో పాటు, నీటి యాజమాన్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఏం. కోదండ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, రైతు మార్గదర్శి పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి, అంతర్జాతీయ నీటి యాజమాన్య నిపుణులు డాక్టర్ కే. ఎల్లారెడ్డి, జాతీయ నీటి యాజమాన్య నిపుణులు పిఆర్బి సుందర్రావు, తదితరులు పాల్గొన్నారు.
నీటిని విచక్షణా రహితంగా వాడకూడదని, అత్యంత పొదుపుగా వాడుకోవాలని, నీరు లేకపోతే భవిష్యత్తు లేదనేది ప్రతి ఒక్కరు నొక్కి వక్కానించారు.
సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం రాబోయే సంవత్సరాలలో పలు సంస్కరణలు చేపట్టాల్సిందని వక్తలందరూ తెలియజేశారు.