ప్రసూతి, శిశు మరణలు సంభవిస్తే కఠిన చర్యలు ప్రసూతి కేసులను ఇతర ఆసుపత్రి లకు రిఫర్ చేయవద్దు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
ఇక నుంచీ జిల్లాలో ఒక్క ప్రసూతి, శిశు మరణలు సంభవించినా, ప్రసూతి కేసులను ఇతర ఆసుపత్రి లకు రిఫర్ చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ హెచ్చరించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రసూతి, ప్రసూతి మరియు శిశు మరణాల కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జూలై నుండి డిసెంబర్ వరకు జిల్లాలో ప్రసూతి తల్లుల మారణాలు, నావజాత శిశు మరణాలు సంభవించగా, వాటిపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా మరణాలకు కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ, ఇకనుంచి జిల్లాలో ఒక్క ప్రసూతి, శిశు మరణం కూడా సంభవించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని విడనాడాలని, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. మరణాల తరువాత సమీక్షించడం కంటే, వాటిని సంభవించకుండా అరికట్టడమే మనకు అత్యంత ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రయివేటు ఆసుపత్రి వాళ్ళు చికిత్స చేయగాల సమర్థ్యం ఉంటేనే చికిత్స చెయ్యల్లన్నారు లేని యెడల వెంటనే చికిత్స లభించే ఆసుపత్రి లకు తరలించాలన్నారు. వైద్యారోగ్య సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఏమరుపాటుగా ఉన్నా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చంచారు.ఇంత యంత్రాంగం ఉండికూడా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, అంగన్‌వాడీలు ఉండికూడా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న మరణాల్లో 90శాతం వరకు అరికట్టదగినవేనని ఆమె స్పష్టం చేశారు. ఇకనుంచీ ఎక్కడైనా ప్రసూతి, శిశు మరణం సంభవిస్తే, సంబంధిత అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో డి.ఎం.అండ్. హెచ్.ఒ.డాక్టర్ పి రవి కుమార్, డి.సి.హెచ్.ఎస్ డా.ఎస్. శ్రీనివాస రావు, డి.ఐ.ఓ డా, చంద్ర శేఖర్, డి.పి .హెచ్.ఎన్.ఓ.నాగమణి, ఎన్ టి ఆర్ ఆసుపత్రి డాక్టర్లు, సి .హెచ్.సి, పి.హెచ్.సి., మెడికల్ ఆఫీసర్లు, ఎ.ఎన్ .ఎమ్.లు, ఆశ వర్కర్లు, ఎమ్.ఎల్.హెచ్.పి.లు, కమిటీ సభ్యులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.