ఫ్లాష్ ….. ఫ్లాష్.. భగాయత్ లో భూ బకాసురుడిపై కన్నెర్ర చేసిన అధికారులు..

---Advertisement---

ఫ్లాష్ ….. ఫ్లాష్.. భగాయత్ లో భూ బకాసురుడిపై కన్నెర్ర చేసిన అధికారులు..

నేలమట్టమైన కబ్జాల కోటలు..

కిరాయి పేరుతో అక్రమంగా వసూళ్లు చేస్తున్న లక్షల ఆదాయానికి చెక్. 

భూబకాసూరుడిపై క్రిమినల్ కేసులకు అధికారుల ప్రయత్నం.

ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం.

ఉప్పల్ భగాయత్ లో భూ బకాసురుడిపై అధికారులు కన్నెరచేశారు. కొన్ని సంవత్సరాలుగా భగాయత్ లోని హెచ్ఎండిఏ కు సంబంధించిన ఖాళీ స్థలాలను ఆక్రమించి, మడిగలను నిర్మిస్తూ మార్బుల్ షాపులకు అద్దెలకు ఇచ్చుకుంటున్న విషయం తెలిసిందే.

 భగాయత్ భూ బకాసురుడి భూకబ్జాలపై ఇటీవల ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి వరుసగా ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు.

 శుక్రవారం భూ బకాసురుడికి సంబంధించిన భూకబ్జాలపై అధికారులు చర్యలకు పూనుకున్నారు. 

కబ్జాలను ఒక్కొక్క దాన్ని గుర్తిస్తూ వాటిల్లో ఉన్న నిర్మాణాలను తొలగించే పనులను చేపట్టారు. బకాసురుడి భూకబ్జాలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ప్రతి నెల వసూళ్లు చేస్తున్న లక్షల రూపాయల ఆదాయానికి అధికారులు గండి కొట్టారు. 

ఇదే కాకుండా హెచ్ఎండిఏలో ఖాళీ స్థలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై కూడా అధికారులు సీరియస్ గా ఉన్నారు.

 

భగాయత్ లో మరో భూ భూబకాసురుడు రాకుండా ఉండేందుకు క్రిమినల్ కేసులను కూడా బనాయించేందుకు ఇప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment