ఎంపీ వద్దిరాజు మహా కుంభమేళాలో
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు మహా కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు.మహా కుంభమేళ 144 సంవత్సరాలకొకసారి జరుగుతుందన్న విషయం తెలిసిందే.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ (అలహాబాద్)వద్ద గంగా,యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులు కలవడాన్ని త్రివేణి సంగమం అంటారు.మహా కుంభమేళ సందర్భంగా ఈ సంగమంలో స్నానం చేయడం పరమ పవిత్రమైనదని,పూర్వజన్మ సుకృతమని భావిస్తారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు గురువారం భక్తి ప్రపత్తులతో పుణ్య స్నానమాచరించి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ సమర్పించారు.