పార్లమెంట్ లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అమర్యాదగా, అగౌరవంగ చేసిన వ్యాఖ్యలకు నిరసన గా మంత్రి, ఎం పి, ఎమ్మెల్యే ప్రెస్ మీట్..

---Advertisement---

యాదగిరి గుట్ట సమర శంఖమ్ :- 

పార్లమెంట్ లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అమర్యాదగా, అగౌరవంగ చేసిన వ్యాఖ్యలకు నిరసన గా రాష్ట్ర రోడ్లు & భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదగిరిగుట్టలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

పార్లమెంట్ లో అంబేద్కర్ ని కించపరుస్తూ అమిత్ షా  చేసిన వ్యాఖ్యలు ఇక్కడి భువనగిరి నియోజకవర్గం ప్రజలకు కూడా తెలియాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము.

రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి పదవికి రాజీనామా చేయాలి.

అంబేద్కర్ పేరు పలికే బదులు ఏదైనా ఒక దేవుని పేరు పలకండి పుణ్యం వస్తుంది అని ఒక బాధ్యతగల హోంశాఖ మంత్రి చెప్పడం 

తూ తూ మంత్రంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరిపారు.

కేవలం జమిలి ఎన్నికల బిల్లు కోసమే ఈ సమావేశాలు జరిపారు. 

శీతాకాల సమావేశాలు మొత్తం ప్రతిపక్షాలను తప్పుబట్టే విధంగానే జరిపారు కానీ 

పార్లమెంట్ సమావేశంలో కనీసం ఆదాని అంశం మణిపుర్ అంశం పై కనీసం రెండు నిమిషాల పాటు అయినా చర్చ జరపాలని మేము కోరాము వారు చర్చ చేయకుండా సభను వాయిదా వేసుకుంటూ వచ్చారు.

 రాజ్యాంగం పట్ల బిజెపికి ఏమాత్రం గౌరవం లేదు అంబేద్కర్  రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తుంది.

 పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం

రాజ్యసభలో అమిత్ షా మాట్లాడిన మాటలను నేను మాట్లాడలేదు ఎవరో ఎడిట్ చేశారని చెప్పుకోవడం ఆస్యాస్పదం. 

చేసిన తప్పును కప్పిపుచ్చుకొని దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు బిజెపి అనేతలు

మేము ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నాలు చేశాము నిరసనలు తెలిపాము 

అమిత్ షా నోరు జారినందుకే బిజెపి నేతలు వాళ్లకు వాళ్లే ధర్నాలు చేసి తప్పుదోవ పట్టించారు. 

బిజెపి పార్టీకి రాజ్యాంగ మీద గాని ప్రజాస్వామ్యం మీదగాని గౌరవంగాని నమ్మకం గాని లేదు. 

చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు.

Join WhatsApp

Join Now

Leave a Comment